వయనాడ్‌ ప్రజలకు ధన్యవాదాలు: రాబర్ట్ వాద్రా

వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ దాదాపు 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ప్రియాంక విజయంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. ప్రియాంక కృషిని గుర్తించిన వయనాడ్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో వినిపించేందుకు ప్రియాంక శ్రమిస్తుందని తెలిపారు. అలాగే తాను కూడా ప్రజల కోసం శ్రమిస్తూనే ఉంటానన్నారు.

సంబంధిత పోస్ట్