ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీపీ నగర్ చౌక్ సమీపంలో, శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 55 ఏళ్ల జీవన్ పంత్‌ను యూపీ రిజిస్ట్రేషన్ గల థార్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని వెంటనే తివారీ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.