పురపోరులో ఆ ప్రాంతమే కీలకం.. కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, ప్రధాన పార్టీలు గెలుపుపై దృష్టి సారించాయి. కాంగ్రెస్ 100కు పైగా మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో, మంత్రులకు ఎన్నికల వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీ, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లతో పాటు 10 మున్సిపాల్టీలలో విజయం సాధించాలని యోచిస్తోంది.

సంబంధిత పోస్ట్