అదే బలహీనతైంది: విరాట్ కోహ్లీ

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అయితే కోహ్లీకి కవర్‌ డ్రైవ్ బాగా ఆడతాడని పేరు. కానీ అదే అతడి బలహీనతైందని కోహ్లీ తాజాగా తెలిపాడు. 'ఇది నాకు సంకట స్థితి. కొన్నేళ్ల నుంచి కవర్ డ్రైవ్ నా బలహీనతగా మారింది. కానీ ఆ షాట్‌తో నేను చాలా పరుగులు చేశా. ఈ రోజు నేను నా షాట్లను నమ్ముకున్నా. నా తొలి రెండు బౌండరీలు కవర్ డ్రైవ్ ద్వారా వచ్చాయి' అంటూ పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్