నా భర్త హత్య వెనుక ఆ వ్యక్తి హస్తం: జడ్పీటీసీ భార్య

AP: కొయ్యూరు జడ్పీటీసీ నూకరాజు హత్య వెనుక అజయ్ కుమార్ అనే వ్యక్తి హస్తం ఉందని భార్య గంగమ్మ ఆరోపించారు. సొంత ఊరిలో స్థలం అమ్మి కోటి రూపాయలతో పొలం కొన్నామని ఆమె చెప్పారు. అయితే ఆ పొలంలోకి వెళ్తే దాడులు చేస్తున్నారని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కానీ పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాన్ ప్రకారమే తన భర్తను చంపారని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్