తెలంగాణాను రుతుపవనాలు తాకేది అప్పుడే!

ఈ ఏడాది తెలంగాణలో వానాకాలం ఆలస్యంగా ప్రారంభం కానుంది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 5వ తేదీ తర్వాతే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. మే చివరి వారంలో రుతుపవనాలు వస్తాయని ముందుగా భావించినా, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఆశించిన వేగాన్ని చూపడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాల కదలికలు మందగించాయి. దీంతో జూన్ 5 నుంచి 10వ తేదీ మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు రావచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్