AP: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో రాత్రి వేళ కలవడంపై బాధితురాలు స్పందించారు. ‘మార్నింగ్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉంటారని ఎమ్మెల్యే చెప్పారు. అందుకే రాత్రి వేళ కలిశాను. గన్ మెన్, సెక్యూరిటీ ఉంటుందనుకున్నాను. అందుకే వెళ్లాను. ఏ ఎమ్మెల్యే కూడా ఇంత దారుణం చేయడని భావించి రాత్రిపూట వెళ్లాను. మా ఆయనకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెప్పారు. అందుకే ఐదుసార్లు అబార్షన్ చేయించుకున్నాను’ అని బాధితురాలు మీడియాతో తెలిపారు.