అందువల్లే తిరిగి మైదానంలో అడుగు పెట్టగలిగాను: హార్దిక్‌ పాండ్య

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, సానుకూల దృక్పథమే తనను తిరిగి మైదానంలో అడుగుపెట్టేలా చేసిందని, గాయం తర్వాత మరింత దృఢంగా పునరాగమనం చేశానని తెలిపాడు. ఆసియా కప్‌లో గాయపడి రెండు నెలల తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20లో ఆడిన హార్దిక్‌, బ్యాటింగ్‌లో 28 బంతుల్లో 59* పరుగులు చేసి, బౌలింగ్‌లో ఒక వికెట్‌ తీసి జట్టు విజయానికి తోడ్పడ్డాడు. గాయాలు మానసికంగా పరీక్షిస్తాయని, దృఢంగా నిలబడటం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగిందని, మనపై మనకే నమ్మకం ఉండాలని అతడు పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్