సినిమాల్లో అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు హీరోగా మాత్రం చేయలేదు. ఓ ఇంటర్వ్యూలో కోట మాట్లాడుతూ.. "నేను పరిశ్రమలోకి వచ్చిన టైంలో హీరో పాత్రలపై దృష్టి లేదు. ఇప్పటికీ నా ఇంటి ముందు నుంచి ఎవరైనా వెళ్తే 'ఇది నటుడు కోట శ్రీనివాసరావు ఇల్లు' అని అనుకుంటారు. అదే నేను హీరోగా చేసుంటే 'వీడికెందుకురా ఈ పనులు' అని అనుకునేవారు. నాకు అది ఇష్టం లేదు. హీరోగా చేయలేదు కాబట్టే ఇంకా జీరో కాకుండా ఉన్నాను." అని చెప్పారు.