ప్రమాదం నన్ను షాక్‌కు గురి చేసింది: రామ్మోహన్ నాయుడు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తొలిసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టుకు 2 కి.మీ దూరంలోనే ప్రమాదం జరిగిందని, 650 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విమానం కూలిపోయిందని తెలిపారు. ప్రమాదం తనను షాక్‌కు గురి చేసిందన్నారు. అలాగే బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్ చేస్తున్నామని, దానితో మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్