బ్రిటిష్ నటి, సింగర్ సింథియా ఎరివో తన నవ్వుకోసం ఏకంగా రూ.16.5 కోట్లతో నోటికి బీమా చేయించారు. 38 ఏళ్ల సింథియా నటన, గాత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్, టోనీవంటి ప్రతిష్ఠాత్మక అవార్డులకు నామినేషన్లను పొందారు. ఆమె లాగే జెన్నిఫర్ లోపెజ్ తన వీపు భాగాన్ని రూ.200కోట్లతో, అమెరికన్ సింగర్ మారియా కరే తన కాళ్లు, స్వరపేటికల కోసం రూ.500 కోట్లకు ఇన్సూరెన్స్ తీసుకున్నారు.