ప్రియుడిని కడతేర్చిన నటి

కర్ణాటకలోని హాసనకు చెందిన తన ప్రియుడు మోహన్ కృష్ణ (45)ను హత్య చేసిన ఆరోపణలపై నటి ఊర్వశిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు సహకరించిన వినయ్, ధనుష్ అనే యువకులనూ అదుపులోకి తీసుకున్నారు. భజరంగి, కాలభైరవ, పోలీస్ క్వార్టర్స్‌ తదితర చిత్రాల్లో ఆమె నటించారు. మూడు నెలల క్రితం మోహన్ కృష్ణ, ఊర్వశికి వేర్వేరు వ్యక్తులతో వివాహమైంది. తమ భాగస్వాములను విడిచి వీరిద్దరూ భార్యాభర్తలం అంటూ సహజీవనం చేస్తున్నారు. మరో ఇద్దరితో వివాహేతర సంబంధం ఉందని ఊర్వశిని మోహన్ కృష్ణ ప్రశ్నించడంతో అతడిని చంపేసింది.

సంబంధిత పోస్ట్