అఫ్గానిస్థాన్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని భారత వ్లాగర్ కైలాశ్ మీనా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్కడ ఓ వీధి వ్యాపారి వద్ద దానిమ్మ జ్యూస్ తాగిన కైలాశ్.. వ్యాపారికి డబ్బులు ఇవ్వగా, అతను తీసుకోవడానికి నిరాకరించాడు. పైగా “మీరు మా అతిథి” అంటూ ప్రేమగా స్పందించాడు. స్థానికుల నుంచి భారతీయులపై ఉన్న గౌరవాన్ని మరో వ్యక్తి కూడా వివరించాడు. ఈ హృదయాన్ని హత్తుకునే వీడియో SMలో వైరల్ అవుతోంది.