రాత్రి నిద్రకు ముందు కాళ్లు కడుక్కోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు!

చాలామంది రాత్రి పడుకునే ముందు ముఖం కడుక్కుంటారు కానీ, కాళ్లు కడుక్కోవడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. రోజంతా నడవడం వల్ల కాళ్లపై దుమ్ము, చెమట, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. రాత్రి పడుకునే ముందు కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వల్ల చర్మంపై ఉన్న వ్యర్థాలు తొలగిపోవడమే కాకుండా శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడుతుంది. ఇది మంచి నిద్రకు కూడా దోహదపడుతుంది. కాళ్లు, చేతులు చల్లటి నీటితో కడుక్కోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది. పాదాల్లో అనేక ప్రెషర్ పాయింట్లు ఉత్తేజితమై కండరాల అలసట తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్