TG: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుసుల్తానాపూర్ గ్రామంలో గురువారం దారుణ ఘటన వెలుగుచూసింది. కిసాన్ పూర్ కి చెందిన గంగాధర లక్ష్మి అనే మహిళకు పని ఇప్పిస్తానని చెప్పి బుధవారం ఓ దుండగుడు తీసుకెళ్లాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారం లాక్కొని బావిలో తోసేశాడు. సుమారు 24 గంటలపాటు బాధితురాలు బావిలోనే నరకయాతన అనుభవించింది. ఇవాళ (గురువారం) బావి యజమాని ఆమెను గుర్తించి స్థానికుల సహాయంతో బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.