9వ తరగతి విద్యార్థి గొంతు కోసి పరారైన దుండగుడు

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు స్పోర్ట్స్ స్కూల్‌లో దారుణ ఘటన జరిగింది. 9వ తరగతి చదువుతున్న సుశాంత్ అనే విద్యార్థి గొంతును దుండగుడు బ్లేడ్‌తో కోసి పరారయ్యాడు. సుశాంత్ తోటి విద్యార్థులతో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గొంతుపై తీవ్ర గాయాలైన ఆ విద్యార్థిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్