AP: నెల్లూరు జిల్లా జొన్నవాడ సమీపంలో రోడ్డు పక్కన ఒక మహిళ మృతదేహం కాలిపోతున్న స్థితిలో కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది. దుండగులు మహిళను వేరే చోట హత్య చేసి, ఆధారాలు దొరకకుండా ఇక్కడకు తెచ్చి తగలబెట్టి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నెల్లూరు జిల్లా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.