రాజస్థాన్‌లో ఫ్లెమింగోల ఆకర్షణ

రాజస్థాన్‌లోని సంభార్ సరస్సు ఈ ఏడాది లక్షకు పైగా ఫ్లెమింగోలను ఆకర్షించింది. సాధారణంగా శీతాకాలంలోనే కనిపించే ఈ వలస పక్షులు జూన్‌లోనూ కనిపించడం విశేషం. గతేడాది కేవలం 7,147 ఫ్లెమింగోలు మాత్రమే వచ్చాయి. ఈసారి అధిక సంఖ్యలో రావడంతో సరస్సు నివాసయోగ్యంగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర ఆసియా, సైబీరియా ప్రాంతాల నుంచి అనుకూల వాతావరణం కోసం ఇవి ఇక్కడికి వలస వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్