‘కాంతార-2’ సినిమా షూటింగ్ సమయంలో కర్ణాటకలోని మస్తికట్ట వద్ద ప్రమాదం జరిగింది. రాత్రివేళ నటుడు రిషబ్ శెట్టి సహా 30 మందికి పైగా ఉన్న పడవ బోల్తా పడింది. అయితే అందరూ క్షేమంగా ఈత కొట్టి ఒడ్డుకు చేరినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో షూటింగ్‌కు తీసుకెళ్లిన కెమెరాలు, ఇతర పరికరాలు నీటిలో మునిగిపోయినట్టు సమాచారం.