AP: అంగన్వాడీ కేంద్రం నుంచి అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమైంది. రెండు రోజుల కిందట అదృశ్యమైన బాలుడు పొలాల్లో విగతజీవిగా కనిపించాడు. కొడుకు మృతదేహాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కొనకనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన శ్రీను, సురేఖ దంపతుల కుమారుడు లక్షిత్ (రెండున్నరేళ్లు). ఈ నెల 8న గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అదృశ్యమయ్యాడు. కంది పొలంలో బాలుడి మృతదేహం కనిపించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.