గుండుసూది మింగిన బాలుడు.. చివరికి!

AP: గుండుసూది మింగిన ఓ బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గోసవీడులో చోటు చేసుకుంది. కోట వరుణ్ సందేశ్ అనే బాలుడు మూడు రోజుల కిందట దంతాలను గుండుసూదితో క్లీన్ చేస్తుండగా అది గొంతులోకి జారిపోయింది. గుండుసూది ఊపిరితిత్తుల వద్దకు చేరింది. వాంతులతో పాటు సూది మొన గీసుకుపోయి నోటి వెంట రక్తం కూడా వచ్చింది. విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. అక్కడి వైద్యులు చాకచక్యంగా గుండుసూదిని కడుపులో నుంచి బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు.

సంబంధిత పోస్ట్