సువేందు అధికారి పీఏ దారుణ హత్య

పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత ప్రతిపక్ష నేత, సీఎం రేసులో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి పీఏ చంద్రనాథ్‌ రథ్‌ బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో దుండగులు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆయనమీద కాల్పులు జరిపారు. బుల్లెట్‌ గాయాలైన ఆయనను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ప్పటికే మృతి చెందారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నాయి. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్