రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతి పై నుంచి బస్సు వెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఓ యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వలన యువతిపైకి దూసుకెళ్లింది. తెలంగాణలోని హైదరాబాద్ - మాదాపూర్ పీఎస్ పరిధిలో కొత్తగూడ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో యువతి శరీర భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు విడిచింది.