అదుపుతప్పి కారు బోల్తా.. నుజ్జునుజ్జు

TG: నాగర్ కర్నూల్(D) అమ్రాబాద్(M) హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిఅపై ఘోర ప్రమాదం జరిగింది. వటవార్లపల్లి గ్రామ సమీపంలో ఓ కారు అదుపుతప్పి ఘాట్ రోడ్డుపై బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఆమనగల్ గ్రామానికి చెందిన రమేష్ కుటుంబ సభ్యులతో శ్రీశైలం నుండి HYDకి కారులో బయలుదేరారు. వటవార్లపల్లి గ్రామ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్