AP: ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఎన్టీపీఎస్ కూలింగ్ కాలువలో మహిళ శరీర భాగాలు లభ్యమైన కేసులో, మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కల్యాణిగా పోలీసులు గుర్తించారు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఆమె వివరాలు తెలిశాయి. భర్తతో విడిపోయి మంగళగిరిలోని ఓ హోటల్లో సప్లయర్‌గా పనిచేస్తున్న కల్యాణిని ఈ నెల 17న హత్య చేసి, మృతదేహాన్ని పది ముక్కలుగా కట్ చేసి కాలువలో పడేశారని పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు, నిందితుల కోసం దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.