AP: రాష్ట్రంలో తోతాపురి మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ధరల పతనం, రైతుల ఆదాయం పెంచేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, తోతాపురి మామిడి ధరలు పడిపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న నష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.