రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా 7 కొత్త పథకాల అమలుకు కేంద్రం నిర్ణయం

రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా రూ.14,235 కోట్లతో కొత్త పథకాల అమలుకు కేంద్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సాగులో సాంకేతిక వినియోగం పెంచేలా డిజిటల్ అగ్రి మిషన్ అమలు చేస్తారు. అలాగే సాగులో శాస్త్రీయ విధానాల అమలు, వ్యవసాయ విద్య బలోపేతం, పాడిలో ఉత్పాదకత పెంపు, ఉద్యాన పంటల్లో సుస్థిరత, కృషివిజ్ఞాన కేంద్రాల బలోపేతం, వ్యవసాయ రంగ సహజ వనరుల సంరక్షణకు చర్యలు చేపడతారు.

సంబంధిత పోస్ట్