ఏపీకి నక్షా కింద రూ.125 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఏపీకి నక్షా కింద రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడంలో చూపిన ప్రగతికి కేంద్రం ఈమేరకు నిధులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. 10 పట్టణ స్థానిక సంస్థల్లో చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ విషయాన్ని ‘ఎక్స్‌’ ద్వారా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్