TG: యూనివర్సిటీలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులను బీజేపీ హరిస్తోందన్నారు.హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ఘటనను గుర్తు చేశారు. వర్సిటీ నుంచి సస్పెండ్ చేయడంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. దళిత, ఆదివాసీలను బీజేపీ చిన్నచూపు చూస్తోందని, కేంద్రం చర్యలను మేధావులు వ్యతిరేకించాలని అన్నారు.