PF ఉపసంహరణ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పథకంలో కీలక మార్పులు చేసింది. ఈపీఎఫ్ 1952 స్థానంలో కొత్త ఈపీఎఫ్ 2026 స్కీమ్‌ను జూన్ 29 నుంచి అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం, ఉద్యోగులు పాక్షికంగా పీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవడానికి కనీసం 25% బ్యాలెన్స్ ఉంచాలి. వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఉద్యోగం మానేసిన తర్వాత వంటి పలు కారణాలకు నిర్దిష్ట పరిమితులతో ఉపసంహరణకు అనుమతి ఉంది. ఈ మార్పులు 8 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులపై ప్రభావం చూపనున్నాయి.

సంబంధిత పోస్ట్