జగన్‌కు కేంద్రం రక్షణ కల్పించాలి.. మోదీ, అమిత్‌షాలకు మిథున్‌రెడ్డి లేఖ

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాని మోదీ, అమిత్ షా కు లేఖ రాశారు. జగన్‌కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ విధానాలతో జగన్ ప్రాణానికి ముప్పు ఉందని లేఖలో పేర్కొన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి అని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్