కేసీఆర్ పాలనలో సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది: హరీశ్‌రావు

కేసీఆర్ పాలనలో తెలంగాణలో 2 కోట్ల 20 లక్షల ఎకరాల మాగాణి సాగు చేశారని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో బీఆర్ఎస్ పాలనపై ప్రశంసలు దక్కాయని అన్నారు. 'కాళేశ్వరం, మిషన్ కాకతీయ వల్ల 32 లక్షల ఎకరాల ఆయకట్టును బీఆర్ఎస్ సాధించింది. అందుకే సాగు విస్తీర్ణం పెరిగింది. ఇప్పటికైనా మా మీద నోరు పారేసుకునే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు నోరు మూస్తే మంచింది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్