తెలంగాణకు సరిపడా యూరియా కేంద్రం ఇస్తోంది: MP రఘునందన్

TG: మంత్రి పొన్నం వ్యాఖ్యలకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు సరిపడా యూరియాను కేంద్రం పంపిస్తోందన్నారు. రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వమే విఫలమైందని విమర్శించారు. ఢిల్లీలో ధర్నా చేసిన వ్యక్తి ఎక్కడున్నారో తెలుసని, రేపు కాంగ్రెస్ ఎక్కడుంటుందో చూడాలన్నారు. తమ అధ్యక్షుడు పరిగెత్తే యువ నాయకుడన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం తమ లక్ష్యమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్