ఉయ్యాలే ఉరితాడై.. చిన్నారి ప్రాణాలు తీసింది

TG: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పీఎస్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్నకూతురి కోసం తల్లి చీరతో కట్టిన ఉయ్యాల, పెద్దకూతురి ప్రాణాలను బలితీసుకుంది. మంగళవారం తల్లి నవనీత పనికి వెళ్లిన సమయంలో, ఎనిమిదేళ్ల పెద్దకుమార్తె ఉయ్యాల ఊగుతుండగా.. ప్రమాదవశాత్తు మెడకు చీర చుట్టుకుని ఊపిరాడక చనిపోయింది. పని ముగించుకుని వచ్చిన తల్లికి తన బిడ్డ నిర్జీవంగా కనిపించడంతో బోరున విలపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెపట్టారు.

సంబంధిత పోస్ట్