వణికిస్తున్న చలి.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రం

తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఏపీలలోని అల్లూరి జిల్లా అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదైంది. తెలంగాణలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8.1 డిగ్రీలు రికార్డ్ అయ్యాయి. ఆసిఫాబాద్‌లో 8.4, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 8.6 చొప్పున నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. వృద్ధులు, చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్