ఓ శునకం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న ఘటన ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పటమటలో జరిగింది. శుక్రవారం స్థానిక రామారావు అనే వ్యక్తి తన మనుమరాలిని కాలేజీ బస్సు ఎక్కించేందుకు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో అభి అనే యువకుడు జాగింగ్ చేస్తూ తన వెంట తీసుకొచ్చిన కుక్కను రామారావు మనుమరాలి మీదకి వదిలాడు. దాంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఒకరి మీద ఒకరు పటమట పీఎస్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.