పెన్ను ఖరీదు..రూ.7.80 లక్షలు

డిజిటల్‌ యుగంలో పెన్నులపై ఆసక్తి తగ్గుతున్నా.. హైదరాబాద్‌ పెన్‌ షో-2026 ఆకట్టుకుంటోంది. రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవనంలో శుక్రవారం ప్రారంభమైన ఈ మూడు రోజుల ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 24కుపైగా పెన్‌ తయారీదారులు, ఇంక్‌ రూపకర్తలు పాల్గొన్నారు. రూ.50 నుంచి రూ.7.80 లక్షల విలువైన పెన్నులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చేతితో తయారు చేసిన ఫౌంటెన్‌ పెన్నులు, లిమిటెడ్‌ ఎడిషన్‌ మోడళ్లు, బంగారం, వెండి, ప్లాటినమ్‌, వజ్రాలతో రూపొందించిన పెన్నులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సంబంధిత పోస్ట్

✕
✕