అమెరికాలో పిల్ ఖరీదు రూ.85 వేలు.. ఇండియాలో రూ.35

భారత్‌లో మందుల ధరలు అమెరికాతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని వివరిస్తూ అమెరికాకు చెందిన లిజ్ అనే మహిళ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె అత్త రక్త క్యాన్సర్ చికిత్సలో భాగంగా అవసరమైన రెవ్లిమిడ్ అనే ఔషధం అమెరికాలో సుమారు 900 డాలర్లు (దాదాపు రూ.85 వేలు) ఉంటే, భారతదేశంలో రూ.35 నుంచి రూ.300 మధ్య లభిస్తుందని ఆమె వెల్లడించింది. 'అమెరికాలో ప్రజలను దోచుకుంటున్నారు, కానీ భారత్‌లో వైద్యం, మందులు అందుబాటు ధరల్లో ఉన్నాయి' అని లిజ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్