దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి రెడీ

దేశంలో తొలి బుల్లెట్ రైలు వచ్చే ఏడాది ఆగస్టు 15, 2027న పట్టాలపై పరుగులు పెట్టనుంది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్‌లో సూరత్-బిలిమోరా సెక్షన్ మొదటగా ప్రారంభమవుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా కారిడార్ల పనులు దశలవారీగా ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. మొత్తం ఏడు బుల్లెట్ రైలు కారిడార్లు ప్రకటించగా, డిసెంబర్ 2029 నాటికి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్