వర్షాకాలంలో టైఫాయిడ్, డయేరియా, వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ప్రమాదం ఎక్కువ. ముఖ్యంగా కలుషిత ఆహారం, నీరు ద్వారా టైఫాయిడ్ వ్యాపిస్తుంది. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి జ్వరం, వాంతులు, విరేచనాలు కలిగిస్తుంది. వైరల్ ఫీవర్, ఫ్లూ కూడా ఈ సీజన్‌లో సాధారణం. నివారణకు శుభ్రమైన నీరు తాగడం, ఆహారాన్ని కప్పి ఉంచడం, చేతులు కడుక్కోవడం, దోమతెరలు వాడడం ముఖ్యం.