తండ్రిపై రీల్స్ చేస్తూ ఆలయంలోకి వెళ్లిన కూతురు.. అంతలోనే.

TG: యాదాద్రి భువనగిరి (D) వలిగొండ (M0 పులిగిల్ల గ్రామానికి చెందిన చంద్రకళ-ఇస్తారి దంపతుల కూతురు లాస్యను మల్లాపురం గ్రామానికి చెందిన కర్రే అనిల్‌తో కొన్నేళ్ళ క్రితం వివాహం చేశారు. అయితే ఇటీవల తన తల్లిగారి ఇంటికి (పులిగిల్ల) వెళ్లిన లాస్య గ్రామంలోనీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి తన తండ్రి, పిల్లలతో కలిసి వెళ్లింది. ఈ క్రమంలో తండ్రిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ రీల్ చేసి SMలో పోస్టు చేసింది లాస్య. ఈ క్రమంలోనే ఆలయం కోనేరులోకి దిగి నీళ్లు చల్లుకుంటుండగా జారిపడి లాస్య చనిపోయింది. దీంతో లాస్య కుటుంబలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్