25 గొర్రెలను చంపిన కుక్క (వీడియో)

ఓ కుక్క 25 గొర్రెలను చంపిన ఘటన నారాయణపేట జిల్లా కొల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గొర్రెల యజమానులు ఓ కంచె ఏర్పాటు చేసి అందులో వాటిని వదిలి వెళ్లారు. కంచెలోకి ప్రవేశించిన కుక్క గొర్రెలపై దాడి చేసి చంపేసింది. యజమానులు సాయంత్రం వచ్చి చూడగా అప్పటికే 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మిగతా 23 గొర్రెలు ప్రాణాలతో బయటపడ్డాయి. దాదాపు రూ.1.6లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు యజమానులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్