ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు.. తాము లీజుకు తీసుకున్న గనిలో తవ్వకాలు చేపట్టగా రూ.50 లక్షల విలువైన 15.34 క్యారెట్ల వజ్రాన్ని కనుగొన్నారు. సతీశ్ ఖాతిక్ (24), సాజిద్ మహమ్మద్ (23) అనే ఈ స్నేహితులు, తమ సోదరీమణుల వివాహాలకు ఈ డబ్బును ఉపయోగించి, మిగిలిన దానితో వ్యాపారం ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ వజ్రాన్ని త్వరలో వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు.