కూతురితో చనువుగా ఉంటున్నాడని.. యువకుడిని చంపిన బాలిక తండ్రి

TG: సంగారెడ్డి జిల్లా మెగ్యా నాయక్ తండాలో దారుణం జరిగింది. కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని బాలిక తండ్రి చంపేశాడు. గోపాల్ అనే వ్యక్తి కుమార్తెతో దశరథ్ (26) చనువుగా ఉండేవాడు. ఇది గోపాల్ తట్టుకోలేకపోయాడు. దశరథ్‌ను కొట్టి చంపి, నిజాంపేట్ శివారులోని అటవీప్రాంతంలో పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు తెలుస్తోంది. భర్త అదృశ్యంపై దశరథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక నిందితుడు నారాయణఖేడ్ PSలో లొంగిపోయాడు.

సంబంధిత పోస్ట్