ఢిల్లీలోని శనివారం ఓ షాకింగ్ ఘటన జరిగింది. కేశవపురం PS పరిధిలో ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పిల్లలిద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సంఘటన తర్వాత పిల్లల తండ్రి స్పాట్ నుండి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. తండ్రి షాపులోనే హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. తండ్రినే హత్య చేశాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.