బ్రిక్స్ సదస్సు తొలిరోజు ముగిసింది. సభ్య దేశాలు ఢిల్లీ డిక్లరేషన్కు ఆమోదం తెలిపాయి. శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నట్లు సంయుక్త ప్రకటన వెలువడింది. యుద్ధాలు, ఘర్షణలు, సమస్యల మూలాలను పరిష్కరించాలని సభ్య దేశాలు పిలుపునిచ్చాయి. ఏకపక్షంగా సుంకాలు విధించడాన్ని సభ్య దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, అణుయుద్ధం పొంచి ఉందన్న భయాల పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి.