చమురు దిగుమతులు తగ్గించి, ఇథనాల్ వినియోగాన్ని పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆటోమొబైల్ కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను రూపొందిస్తున్నాయి. తాజాగా మారుతీ సుజుకీ తొలి ఫ్లెక్స్‌ప్యూయల్ కారు వ్యాగనార్‌ను పరిచయం చేసింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్‌దీప్ సింగ్ పురి ఈ కారును గురువారం ఆవిష్కరించారు. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 85 శాతం వరకు ఇథనాల్ బ్లెండ్ చేసిన E85 ఫ్యూయల్‌తోనూ నడుస్తుంది.