దశాబ్దాల క్రితం కనుమరుగైన కర్రా బిళ్ల ఆట (గిల్లి దండ) కు పూర్వ వైభవం తీసుకురావాలని స్పెయిన్ ప్రయత్నిస్తోంది. వారసత్వ ఆటను రక్షించేందుకు పిల్లలకు నేర్పించి, లీగ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. గాలీషియా ప్రాంతంలో 'బిల్లార్డా'గా పిలిచే ఈ ఆట, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ద్వారా మళ్ళీ ప్రాచుర్యం పొందుతోంది.