సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి నటుడు తనికెళ్ల భరణి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 'సినీ పరిశ్రమ 'కోట' కూలిపోయింది. ఆయనతో వ్యక్తిగతంగా దశాబ్దాలకు పైగా పరిచయం ఉంది. సామాన్య మధ్యతరగతిలో పుట్టి అంచలంచెలుగా సినీ శిఖరంగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. నాటకాలు అంటే ఆయనకు ఎంతో ఆసక్తి. అదే సినీ రంగ ప్రవేశానికి పునాది వేసింది' అని గుర్తుచేశారు.