TG: 2028లో KCRని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పోరాడుతున్నామని BRS ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా KTR అన్నారు. తెలంగాణ సాధన కోసం ఆయన అన్ని పదవులను త్యాగం చేసి, 25 ఏళ్ల క్రితం ఇదే రోజున కొండా లక్ష్మణ్ బాబుజి ఆశీస్సులతో జలదృశ్యంలో పార్టీని స్థాపించారన్నారు. నాటి నుంచి 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా ప్రజలను ఐక్యం చేసి తెలంగాణ సాధించామన్నారు. పదేళ్ల పాలనలో KCR రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబట్టారన్నారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్, బీజేపీ నుంచి రక్షించుకునేలా పోరాడుతామని స్పష్టం చేశారు.